మోపాడుబంగ్లా లేఅవుట్ పట్టాలు పంపిణీచేస్తున్న ఎమ్మెల్యే ,తహసీల్దార్మోపాడు బంగ్లా లేఅవుట్ వద్ద ఇళ్ల నిర్మాణ శిలాపలకం ఆవిష్కరణ

మోపాడుబంగ్లా లేఅవుట్ పట్టాలు పంపిణీచేస్తున్న ఎమ్మెల్యే ,తహసీల్దార్
మోపాడు బంగ్లా లేఅవుట్ వద్ద ఇళ్ల నిర్మాణ శిలాపలకం ఆవిష్కరణ

06/01/21
పామూరు జనవరి 6 న్యూస్ మేట్ :  నియోజకవర్గంలో 8 వేల లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసినట్లు శాసన సభ్యులు బుర్రా మధు సూధన్ అన్నారు. రఖాస్తుచేసుకున్న 90 రోజుల్లో ఇంటిపట్టా ఇస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో సాటిలేని వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు . నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని మోపాడు , చిలుకూరు , దాదిరెడ్డిపల్లె గ్రామాల్లో 95 మందికి వైఎస్సార్ జగనన్న ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసి , ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా తహసీల్దార్ చనుమాల ఉప అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే బుర్రా మాట్లాడుతూ పార్టీలు , కులం , మత భేదాలు లేకుండా ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఇళ్ల స్థల పట్టాలు , ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుటారన్నారు . నియోజకవరంలో 8 వేలమందికి పైగా లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు . సచివాలయ , వలంటిర్ వ్యవస్థతో పాలనను ప్రజలవద్దకు తెచ్చి దేశంలో ఆదర్శముఖ్యమంత్రిగా జగన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాదన్నారు . స్థలాలు మంజూరుకానివారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని 30 రోజుల్లో స్థలం మంజూరు చేస్తామన్నారు . గత టీడీపీ పాలకులు జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను అర్హులకు చెందకుండా పచ్చచొక్కాల వారికే చెందేలా చేసేశారన్నారు . అమ్మ ఒడి, విద్యాదీవెన , వసతి దీవెన , రైతుబరోసా , జగనన్న చేయూత , జగనన్న ఆసరా మొదలైన పథకాల అమలుతో ప్రతి పేద గుండెలో ముఖ్యమంత్రి చోటు సంపాదించారన్నారు . ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఎమ్మెల్యే బుర్రాను ఘనంగా సన్మానించారు . కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్ రెడ్డి , జడ్పీటీసీ అభ్యర్థి చప్పిడి సుబ్బయ్య , డీ.టీ.ఆర్.నాసరుద్దీన్ , మండల సర్వేయర్లు పందిటి వైష్ణవి , విష్ణువర్ధన్ , ఏపీవో సమీర్ బాషా , హౌసింగ్ ఏఈ వర్మ , రమణ , జడ్పీటీసీ మాజీ సభ్యులు యం.గురవయ్య , డాక్టర్ కోటపాటి శ్రీనివాసులు , పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి యూత్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాసరెడ్డి , యూత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇర్రి కృష్ణారెడ్డి , కొడవటికంటి చిన్నయ్య , ఎంపీటీసీ సభ్యులు కోరె బ్రహ్మానందరెడ్డి , పోలినేని శ్రీను , సింగిల్ విండో చైర్మన్ చల్లా సుబ్బారావు , గట్లా విజయబాస్కర్ రెడ్డి , మాజీ సర్పంచ్ చప్పిడి వరలక్ష్మి మాలెం వెంకటేశ్వరరెడ్డి , జి.వెంకటేశ్వరరెడ్డి , చెనికల శ్రీను , పి.దొరబాబు , కోడూరి రామసుబ్బారెడ్డి , మండాది వెంకటనారాయణ , గంధం భాస్కర్ , మలినేని శ్రీను , మిరియం రామారావు . ఒంటేల నాగార్జున , బి.మార్కు కే.కృపాదానం , మెడబలిమి బ్రహ్మయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *