100 కోట్ల విలువ చేసే స్థలాన్ని రక్షించడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం

100 కోట్ల విలువ చేసే స్థలాన్ని రక్షించడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం

06/01/21
ఒంగోలు టౌన్ జనవరి 6 న్యూస్ మేట్ :  ఒంగోలు రంగారాయుడు చెరువు ప్రక్కన ఉన్న షుమారు 100 కోట్లు విలువ చేసే 6.5 ఎకరాల ఖాళీ స్ధలం అన్యాకాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కి ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్ల మధు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రంగారాయుడు చెరువు ప్రక్కన ఒంగోలు నగర పాలక సంస్థకు సంబంధించిన 6.5 ఎకరాలు ఖాళీ స్ధలం ఉంది. ఆ ఖాళీ స్ధలంలో పబ్లిక్ సంబంధించిన నిర్మాణం జరగాలి కానీ గత రెండు రోజులు నుంచి స్ధలం పరిశుభ్రం చేసి పిల్లర్స్ కూడ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ప్రకటనలో తెలిపారు గతంలో కోర్టు కేసు జరిగింది తరువాత పబ్లిక్ కి ఉపయోగ పడే నిర్మాణం మాత్రమే జరగాలని పార్కులు , చిన్న పిల్లల పార్కులు , ఆడిటోరియం లాంటి నిర్మాణం మాత్రమే జరగాలని అలాగే జిల్లా అభివృద్ధి బోర్డు వారు కూడ ప్రభుత్వానికి , జిల్లా యంత్రాంగానికి కూడ రిపోర్ట్ క ఇవ్వడం జరిగింది .కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ ప్రదేశంలో నిర్మాణాలు జరుగుతున్నాయి . నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం వారు ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చారా లేకపోతే షూమరు 100 కోట్ల రూపాయలు విలవ చేసే నగర పాలక సమస్ధ ఆస్తి అన్యాకాంతం అవుతుంటే ఎందుకో చూసి చూడనట్లు నగర టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .వారి పరిధిలోకి ఈ ఖాళీ స్ధలం రాదా లేక వారు నిర్మాణం చేయడానికి అనుమతి ఇచ్చారా ? నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *