స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో కందుకూరు మొదటి స్థానంలో నిలపాలి ..మున్సిపల్ కమిషనర్

స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో కందుకూరు మొదటి స్థానంలో నిలపాలి ..మున్సిపల్ కమిషనర్

06/01/21

కందుకూరు జనవరి 6 న్యూస్ మేట్ :  2021 స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో కందుకూరు మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవాలంటే అందుకు కార్మికులు మూలస్తంభాలు అని మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ అన్నారు. బుధవారం లింగయ్య నాయుడు పార్కులో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త పొడి చెత్త హానికరం చెత్తను వేరు చేయుట పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను వేరు చేయడం వల్ల పలురకాల అనర్థాలు కలుగుతాయని వివరించారు .విధిగా పొడి చెత్త తడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కార్మికులతో చెత్తను వేరు చేయించి మూడు రంగుల వేరువేరు డబ్బాలలో వేయించి మూడు రకాల చెత్త గురించి వారికి వివరించారు. చెత్తను వేరు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను కార్మికులకు అర్థమయ్యేరీతిలో వివరించారు .ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమణారెడ్డి మేస్త్రులు ఆంజనేయ ప్రసాద్, ప్రభాకర్ కార్మికులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *