పాత భవనం పరిశీలించిన డి ఐ జి

పాత భవనం పరిశీలించిన డి ఐ జి

07/01/21
ఉదయగిరి జనవరి 7(న్యూస్ మేట్ )  : నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి లోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించినపాత జైలు భవనాలను బుధవారం కడప జోన్ జైళ్లశాఖ డిఐజి ఎం వరప్రసాద్ పరిశీలించారు స్థానిక తాసిల్దార్, సర్వేయర్లను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రికార్డుల పరంగా ముప్పై ఐదు సెంట్ల స్థలం ఉన్నదని ఆ స్థలం తిరిగి స్వాధీనం పరుచుకునేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాత భవనాన్ని మరమ్మతులు చేసేందుకు వీలు పడితే పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని లేకపోతే భవనాన్ని తొలగించి నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. ప్రస్తుతం ఖజానా శాఖ నిర్మిస్తున్న నూతన భవనం జైళ్ల శాఖ కు సంబంధించినది అని ఆ స్థలంలో గతంలో బాత్రూములు ఉన్నాయని ప్రస్తుత ఖజానా కార్యాలయం నూతన భవనంలోకి వెళ్లగానే ఆ భవనం కూడా తాము స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చి రెవిన్యూ లో తమకు ఎంత స్థలం ఉంది ఎంత వరకు వస్తుంది అనే విషయాలను పూర్తిగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం అని ఆయన అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలోజిల్లా సబ్ జైళ్ల అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, జైలర్ , కె వి రమణయ్య తాసిల్దార్ హరనాథ్, మండల సర్వేయర్ రవి ఉన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *