దళిత యువతి వివాహానికి ఆర్ధిక సాయం
ఉదయగిరి జనవరి 7(న్యూస్ మేట్ ) : గండిపాలెం దళిత వాడలో బుధవారం జరిగిన దళితుల వివాహానికి అదే గ్రామానికి చెందిన సేవా గుణ ఫౌండేషన్ ప్రతినిధులు ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం అందచేశారు.సేవా గుణ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అయితే రావిపూడి అచ్చమ్మ కుమార్తె అయిన అరుణ కు వివాహ కానుకగా ఐదు వేల రూపాయలు అందచేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు