పండుగ వాతావరణంలా ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు

 

పండుగ వాతావరణంలా ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు

07/01/21

కావలి జనవరి 7 (న్యూస్ మేట్) :మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హమీ ఇచ్చిన ప్రకారం నేరవేరుస్తున్నారని పేదలందరిని జగమంతా కుటుంబంగా బావించి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కావలి రూరల్ మండలంలోని అన్నగారిపాలెం పంచాయతీ లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్యక్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు,ఎల్లసిరి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి వార‌ధిలా ప‌ని చేస్తున్న స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తోనే ఇది సాధ్య‌మైంద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టని అనేక సంక్షేమ పథకాలను నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్నఘ‌న‌త వైయస్ జగన్మోహన్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని అన్నారు. ఒక్క‌రూపాయికే ఇంటిస్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేసి, ప్ర‌భుత్వం లబ్దిదారుల‌కు అందిస్తుంద‌ని, స్ప‌ష్టం చేశారు. అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ప‌ట్టాల‌ను పంపీణీ చేశారు.అనంతరం మహిళలతో వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన మహిళలుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి చేతుల మీదుగా మొదటి బహుమతి మూడు కాసుల బంగారం, రెండో బహుమతి రెండు కాసుల బంగారం, మూడు బహుమతి ఒక్క కాసు బంబారం బహుమతి, మూడు వెండి బహుమతులు, మిగిలిన వారికి చీరలు బహుమతులు అందజేశారు. మరియు బీదా మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరుపున ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి బహుమతి మహిళ కు ఐదు వేలు రూపాయలు, రెండో బహుమతి గెలుచుకున్న మహిళ కు వెయ్యి రూపాయలు, మూడో బహుమతి గెలుపొందిన మహిళలుకు వెయ్యి రూపాయలు అందజేసిన బీదా మస్తాన్ రావు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు సన్నిబోయిన ప్రసాద్, మత్స్యకారుల నాయకుడు కొమరిరాజు, రూరల్ అధ్యక్షులు జంపాని రాఘవులు,అన్ని పంచాయతీ నాయకులు,పట్టణ నాయకులు, అధికారులు, మత్స్యకార నాయకులు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *