గుడిసె లేని సమాజం ముఖ్యమంత్రి లక్ష్యం ..విద్యాశాఖ మంత్రి సురేష్
కనిగిరి జనవరి 7 (న్యూ స్ మేట్) : కనిగిరి నగర పంచాయతీ లో జరిగిన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల లో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా నవరత్నాలు పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వటం ఒక మహోన్నత కార్యక్రమమని అన్నారు. ప్రతి గ్రామం ప్రతి వాడ తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలను తీర్చే విధంగా నవరత్నాల కార్యక్రమాన్ని చేపట్టి నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నారని గడిచిన 19 నెలల పరిపాలనలో సీఎం అభివృధ్ది కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చారని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలు చూడాలని లక్ష్యంగా సుమారు 30 లక్షల మందికి పక్కా ఇల్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. నారా చంద్రబాబు నాయుడు జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో లోపాలను చూపలేక దేవుళ్ళ గుడులపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని అమ్మఒడి నాడు-నేడు .జగనన్న విద్య దీవెన జగనన్న గోరుముద్ద మొదలైన పథకాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు అని అన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఆశయంతో కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం కూడా పేద విద్యార్థులకు అందించాలని లక్ష్యంతో ఉంటే చంద్రబాబు నాయుడు వారికి ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టులకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రజలు బాగుండడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాయింట్ కలెక్టర్ వెంకట మురళి సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ మండల తాసిల్దార్ పుల్లారావు మున్సిపల్ కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు ఎంఈఓ ప్రసాదరావు ఏఎంసీ చైర్మన్ సరితా రెడ్డి వైఎస్సార్సీపీ సమన్వయకర్త రంగనాయకులు రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి మడ తల కస్తూరి రెడ్డి ఎంపీటీసీ అభ్యర్థి దంతులూరి ప్రకాశం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ బన్నీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు