తెలంగాణ మద్యం కందుకూర్ లో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కందుకూరు జనవరి 7 న్యూస్ మేట్ : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు శ్రీనివాస చౌదరి ఆవులయ్య ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సులను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కందుకూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ షేక్ కాజా మొహిద్దిన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు .విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం నుండి కందుకూరు వస్తున్న ట్రావెల్ బస్సు లను తనిఖీ చేయగా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన వీరేపల్లి వెంకయ్య దగ్గర 12180 ఎల్ పరిమాణం గల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామానికి చెందిన మధు దగ్గర 22180 ఎల్ మానం గల తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆయన అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు.