సింగరాయకొండ దేవాలయ ఘటనలో అక్రమ అరెస్టులు అమానుషం డాక్టర్ నూకసాని బాలాజీ

సింగరాయకొండ దేవాలయ ఘటనలో అక్రమ అరెస్టులు అమానుషం డాక్టర్ నూకసాని బాలాజీ08/01/21
ఒంగోలు టౌన్ జనవరి 8 న్యూస్ మేట్ :  సింగరాయకొండ దేవాలయం ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి వైయస్ఆర్ సీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు టిడిపి నాయకులను బలి చేయడం సరికాదు.పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల్ని అరెస్టు చేస్తారా?విచారణ జరపమని ప్రశ్నించిన గొంతులను గొంతు నులిమేస్తారా అనిల్ ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు.సింగరాయకొండ మండలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్చి ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చిన వ్యక్తిని విలేకరులను విచారణ జరపండి అని అడిగిన వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని బాలాజీ ఖండించారు.శుక్రవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చెయ్యి ధ్వంసం చేయబడిందా? లేదా అంతకు ముందే ఆ విధంగా ఉందా? అనే వాస్తవ విషయాలను పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఆ ఘటనను చూసి సమాచారం అందించిన ఆ దేవాలయం మోత కాపు ని అరెస్టు చేయడం ఏమిటని అని ప్రశ్నించారు. ఇలా సమాచారం ఇచ్చిన వారిని అరెస్ట్ చేస్తూ పోతే భవిష్యత్తులో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి భయపడి ఎవ్వరూ ముందుకు రారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 140 దేవాలయాల్లో సంఘటనలు జరిగాయని అన్నారు. సింగరాయకొండ దేవాలయ ఘటనకు సంబంధించి ఈ విషయాన్ని ప్రచారం చేశారనే నెపంతో జర్నలిస్టులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. సింగరాయకొండ దేవాలయానికి సంబంధించి వాస్తవాలు బయట పెట్టమని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఇది అప్రజాస్వామిక చర్య అని ఆయన మండిపడ్డారు. గొంతెత్తి ప్రశ్నించే వారిని గొంతు నులిమేస్తున్నారని, ఇది ఫాసిస్టు చర్య అని, వైఎస్సార్సీపీ నాయకుల కుట్రపూరిత చర్యల ఫలితంగానే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఇలా అక్రమ అరెస్టులు చేసి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. సింగరాయకొండ దేవాలయం ఘటనలో వాస్తవ విషయాలను విచారణ జరిపి బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి హరిబాబు, ఆంధ్రజ్యోతి విలేకరి కాకర్ల నరసింహం ను వెంటనే విడుదల చేయాలని, మరలా 15 మందిని అరెస్టు చేయడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలి అని డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *