యరశింగు వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని. చంద్రశేఖర్
పామూరు జనవరి 8 (న్యూస్ మేట్) : పామూరు పట్టణంలోని మనీహర్ష కళ్యాణ మండపంలో కనిగిరి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు ఇరిగినేని తిరుపతి నాయుడు ముఖ్య అనుచరులు సట్టుమడుగు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గుర్రం శేషయ్య గారి మనవడు ఎర్రసింగ్ వెంకట్ నారాయణ, శ్రీమతి నాగరత్నమ్మ గార్ల కనిష్ట పుత్రుడు బాలకృష్ణ , రమ్య ల వివాహ వేడుకలు మనీహర్ష కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసి చైర్మెన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి భవ్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందమయంగా గడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకల్లో ఎర్రసింగ్ ముసలయ్య , గుర్రం రామ సుబ్బారావు , నూతంగి నరసింహారావు, కుండల శ్రీను, గుర్రం నాగేశ్వరరావు, గుర్రం గాంధీ నాయుడు, పామూరు మాజీ సర్పంచ్ కావిటి సుబ్బయ్య లు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.