చిల్డ్రన్స్ హోమ్ లో కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు:

చిల్డ్రన్స్ హోమ్ లో కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు: 08/01/21
కనిగిరి జనవరి 8 (న్యూస్ మేట్) :  వైసిపి నాయకులు కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక కనిగిరి చిల్డ్రన్స్ హోమ్ నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఈ చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ విధంగా చిన్నారుల కి హోమ్ ఏర్పాటుచేసి వారికి ప్రతి నిత్యం అన్ని విధాల సహకరిస్తున్న నిర్వాహకులు అత్తులూరి జాన్, సుకవితలను శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. చిల్డ్రన్స్ హోమ్ కి ఏ అవసరం వచ్చినా తమ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశాడు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి స్నేహితుడు పలుకూరు భాస్కర్, విద్యార్థులు నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *