రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు
పామూరు జనవరి 8 (న్యూస్ మేట్) : పామూరు పట్టణ సమీపంలోని నెల్లూరు రోడ్డు జంక్షన్ వద్ద నేషనల్ హైవే 565 మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి , భోగ్యంవారిపల్లి గ్రామానికి చెందిన షేక్ సనీఫ్, షేక్ లతీఫ్, పూజల గణేష్ లు పట్టణంలోని ప్రవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ ముగించుకుని తమ వద్ద ఉన్న ఏపీ26 ఏ టి. 7844 గ్లామర్ మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళుతున్న తరుణంలో నెల్లూరు రోడ్డు జంక్షన్ వద్ద జాతీయ రహదారి 565 మీద వరికుంటపాడు వైపు నుంచి పామూరు వైపు వస్తున్న KA 21 B-2656 మినీ వాహనం వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ ను ఢీ కొనడంతో మోటార్ సైకిల్ మీద ఉన్న నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ సనీఫ్ (18) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లి గ్రామానికి చెందిన షేక్ లతీఫ్, పూజల గణేష్ లకు తీవ్రగాయాల కాగ అక్కడ ఉన్న స్థానికులు స్థానిక పామూరు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ. చంద్రశేఖర్ హుటాహుటిన తను స్వయంగా క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం షేక్. లతీఫ్, పూజల గణేష్ ఇరువురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు ఎస్ఐ. అంబటి చంద్రశేఖర్ తెలిపారు.