పరిపాలన చేతకాక ప్రతి పక్షం పై నిందలు.. చంచల బాబు యాదవ్

పరిపాలన చేతకాక ప్రతి పక్షం పై నిందలు.. చంచల బాబు యాదవ్

11/01/21
ఉదయగిరి జనవరి 11(న్యూస్ మేట్ ) :  రాష్టంలో ఉన్న అధికార పార్టీకి పరిపాలన చేతకాకనే ప్రతి పక్షం పై నిందలు వేస్తున్నారని నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పొన్నె బోయిన చంచల బాబు యాదవ్ అన్నారు. సోమవారం ఉదయగిరి లోని అయన స్వగృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ అనుచరుడు అని ఆ పార్టీ ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనటం సరి కాదని ఎన్నికల కమీషన్ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని కూడా ముఖ్యమంత్రి కి తెలియక పోవటం విచారకరం అని అన్నారు. మొన్న మార్చి లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో అధికార వై ఎస్ ఆర్ పార్టీ బెదిరించి ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకున్న విషయం పై కమీషన్ కు ఫిర్యాదు చేస్తే ఆయన ఏమైనా రద్దు చేశారా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన రోజు నుండి ప్రతీకారం తప్ప ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర అభిరుద్ది కోసం ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా, లక్ష కోట్ల పెట్టుబడులు వెనక్కి పోలేదా, ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పనికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అంటూ తన వైఫల్యం కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అసలు ఈ రాష్టానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే చంద్రబాబు అడ్డుకోనేది ఏమిటని అన్నారు. పాత పధకాలు మార్చి రియంబర్స్ మెంట్, విదేశీ విద్యా తొలగించి అమ్మ ఒడి అనే పేరుతొ ప్రజలను మోసం చేయటమే నని అన్నారు. తుఫాన్ లో నష్ట పోయిన రైతులకు ఇప్పటి కి పరిహారం అందకపోవటం రాష్ట్ర చరిత్ర లో లేదని చంద్రబాబు ను విమర్శించే అర్హత ఎవరికీ లేదనేది తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశం లో తెలుగుదేశం నాయకులు షేక్ రియాజ్, బయన్న, సుమన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *