సమాజ చైతన్య ప్రతీకలు పత్రికలు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ
కందుకూరు జనవరి 11 న్యూస్ మేట్ : సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు సవివరంగా చూపించేవే పత్రికలని సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు.ఏ వన్ టీవీ తెలుగు న్యూస్ క్యాలెండర్ ఆయన మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నాలుగవ స్థంభం గా పేరున్న పత్రికలు ,న్యూస్ ఛానల్ లు సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావటానికి దోహదపడే వార్తలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. పత్రికా రంగంలో పోటీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో వార్తా కథనాలు ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినే పద్ధతిలో రావటం సబబు కాదని ఆయన సూచించారు. ప్రచార మాధ్యమాలు సమాజ చైతన్యానికి ప్రతీకలుగా నిలవాలని ఆయన కోరారు .ఈ సందర్భంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాలకొండయ్య ఏ వన్ ఛానల్ కందుకూరు డివిజన్ రిపోర్టర్ షేక్ హుస్సేన్ పాల్గొన్నారు