రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సి.ఐ. ప్రభాకర్

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సి.ఐ. ప్రభాకర్

దుత్తలూరు జనవరి 12 న్యూస్ మేట్
నెల్లూరు జిల్లా దుత్తలూరు లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఉదయగిరి సి.ఐ. ప్రభాకర్ రావు ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకా నందుని ఆదర్సముగా తీసుకొని రక్త దాన శిబిరాలు నిర్వహించటం ఎంతో ఆనందించ వలసిన విషయమని ఏదైనా ప్రమాద సమయంలో ముందుగా వారి ప్రాణాలు కాపాడేందుకు అవసరం అయ్యేది రక్తం అని అటువంటి రక్త దానం శిబిరాలు చేస్తూ యువతను ముందుకు తీసుకెళ్తున్న విశ్వభారతి సేవా సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నర్రావుల పుల్లారెడ్డి ని వారి మిత్రులు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో 70 మంది యువత పాల్గొని రక్త దానం చేశారు.ఈ కార్యక్రమంలో యస్.ఐ. జంపాని కుమార్ ,సంస్థ ప్రతినిధులు పెసల కృష్ణ, అందే రామయ్య,నరేంద్ర మహేష్ రెడ్డి. శరత్ రెడ్డి,కె.బాలకృష్ణారెడ్డి,. శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *