కనిగిరిలో రజక విద్య సేవా సంఘం డైరీని ఆవిష్కరించిన రజక నాయకులు

కనిగిరిలో రజక విద్య సేవా సంఘం డైరీని ఆవిష్కరించిన రజక నాయకులు
కనిగిరి జనవరి 13 (న్యూస్ మేట్)
కనిగిరి రజక సంఘం కార్యాలయంలో రజక నాయకులు చేతుల మీదుగా రజక విద్య సేవా సంఘం డైరీ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ డి మూర్తయ్య మాట్లాడుతూ వెనుకబడిన బీసీ లలో రజక కులం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాం అన్నారు సమాజంలో ఎదగాలంటే ప్రతి ఒక్కరూ విద్య ఉద్యోగా రంగాలలో అభివృద్ధి చెంది కులంలో వెనుకబడ్డ వారికి చేదోడుగా నిలవాలన్నారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడి వారి ఉన్నత విద్యకు సహాయ సహకారాలు అందించాలన్నారు. సమస్యలపై అందరం కలసికట్టుగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నారు. కరోనా కష్టకాలంలో రజక సంఘం తరఫున కనిగిరి లో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పేదలకు నిత్యవసర సరుకులు కూరగాయలు దుస్తుల పంపిణీ చేసి వారికి సహాయం అందిచాం అన్నారు. ఈ కార్యక్రమంలో శివ కాశయ్య. పండు. చెన్నయ్య ( ఆర్ఎంపీ). కాశయ్య (టీచర్). నారాయణ (టీచర్). కొండయ్య. నెంబర్ శ్రీను. మాచర్ల సుబ్బయ్య. తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *