నాటుసారాఊట ధ్వంసం

నాటుసారాఊటధ్వంసం

ఉదయగిరి జనవరి 12(న్యూస్ మేట్ )ఉదయగిరి మండల పరిధిలోని బోడబండ గ్రామ శివారులో ఉన్న రెవిన్యూ సర్వే నెంబర్ 22 భూమిలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఉదయగిరి సర్కిల్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సి ఐ శ్రీనివాస రావు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి నాటు సారా ఊట ధ్వంసం చేశారు.తయారీ ప్రదేశం లో సుమారు 490 లీటర్ల ఊట ను ఆయన కనుగొని ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగకు సంబంధించి ఈ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ తయారీకి పూనుకొని ఉంటారని, సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన శిబిరంపై దాడి చేయడం జరిగిందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సి.ఐ. శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాలలో ఇలాంటి చర్యలకు పాల్పడటం నేరం అని, ఎంతటి వారైనా శిక్షార్హులని ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే గ్రామస్తులు తమకు సమాచారం తెలియజేయాలని ఆయన బోడబండ గ్రామ ప్రజలను కోరారు. ఈ సంఘటనపైకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బంది కూడా ఉన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *