ఈనెల 16 న కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవం
ఉదయగిరి జనవరి 12 (న్యూస్ మేట్ )
ఉదయగిరి మండలం లో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఈ నెల 16వ తేదీ న వ్యాక్సిన్ ప్రారంభోత్సవం జరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ఉదయగిరి తాసిల్దార్ హరనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో కోవిడ్ టాస్క్ఫోర్స్ బృందంతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 26 చోట్ల ఈ వ్యాక్సిన్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని అందులో ఒకటి మన ఉదయగిరి లోని సి. హెచ్. సి. సెంటర్ ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. లాంచింగ్ రోజు నాటికి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్ నిల్వకు తగినటువంటి జాగర్త లు చూసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ కన్వీనర్ ప్రాథమిక వైద్యాధికారి అయిన శ్రీ కళ, కమిటీ సభ్యులు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతాప్, ఎంపీడీవో ఆర్ఎస్ వీరస్వామి ఎస్ ఐ మరిడి నాయుడు అంగన్వాడి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు