నల్ల చట్టాల జీవోలు భోగిమంటల్లో దగ్ధం చేసిన రైతు సంఘం నాయకులు

నల్ల చట్టాల జీవోలు భోగిమంటల్లో దగ్ధం చేసిన రైతు సంఘం నాయకులు

15/01/21

యర్రగొండపాలెం జనవరి 13 న్యూస్ మేట్ ; రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాల జీవోలను రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు బుధవారం రైతు సంఘం నాయకులు భోగిమంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు టి సి హెచ్ చెన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 30 రోజుల్లో దేశ రాజధానిలో రైతులు చేయు పోరాటానికి కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టడం లేదని రైతాంగం కరుడుగట్టిన చలిలో కూడా రోడ్డుపైనే నిరసన తెలియజేస్తున్నప్పటికీ రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ మొండిగా వ్యవహరిస్తున్నదన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు  వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా కార్మిక సంఘాలు వ్యాపార సంఘాలు కలసి ఉద్యమాలు చేస్తున్న మన ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వి కృష్ణ గౌడ్, రైతు సంఘం నాయకులు యోగయ్య, మొగిలి చిన్న వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, వెంకటరెడ్డి, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *