జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఒంగోలు టౌన్ జనవరి 13 న్యూస్ మేట్ : ప్రకాశం జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తన శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు . సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి, కమ్మనైన కనుమలతో మీ జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి అని అన్నారు. సంక్రాంతి సంబరాల తో మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.