రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు

రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు

15/01/21

ఒంగోలు జనవరి 13 న్యూస్ మేట్ :
జ𒐜గన్ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
పంట నష్టంపై గోరంత సహాయం కొండంత ప్రచారం
ధాన్యం బకాయిలు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
మోసకారి సున్నా వడ్డీ పథకం
రైతు భరోసా కాదు.. జగన్మోహన్ రెడ్డి రైతు దగా పథకం
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు రైతుల మెడకు ఉరితాడే
రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3 స్థానం
జగన్ పాలన లో సూక్ష్మ సేద్యం సున్నా
కౌలు రైతుల కష్టాలు, ఎరువులు విత్తనాలు సరఫరా లో వైఫల్యం
పంట కుంటల విషయంలో,
ప్రకృతి వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ
ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ బుధవారం ఆరోపించారు రైతుల పండుగ అయిన సంక్రాంతి రోజున వారిలో సంతోషం లేకుండా పోయిందని, జగన్ రెడ్డి విధానంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, అందుకే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో దహనం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల కనుగుణంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగిమంటల్లో రైతు వ్యతిరేక జీవోల దహన కార్యక్రమంలో డాక్టర్ నూకసాని బాలాజీ, దర్శి కో ఆర్డినేటర్ పమిడి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ నూకసాని బాలాజీ విలేకర్లతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని, రైతులకి ఒక వైపు మద్దతు ధర అందించకపోవడం మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు మూలంగా పంట నష్టపోయిన రైతులకు చేయూత అందించకపోవడం అత్యంత విషాదకరం అని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం చేసిన సహాయం గోరంత అని, ప్రచారం మాత్రం కొండంత చేసుకుంటున్నారని విమర్శించారు. నివర్ తుఫాన్ వల్ల ఎకరాకు 30,000 రూపాయల నష్టం జరిగితే, ఎకరాకు 5000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం బకాయిలు 3 వేల కోట్ల రూపాయలు చేరుకున్నాయని, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ఎక్కడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అందించాల్సిన సున్నా వడ్డీ పథకం లో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ పథకాన్ని పరిమితం చేస్తూ జీవో నెంబర్ 464 తీసుకువచ్చారని, ఒక హెక్టార్ రైతుకె సున్నావడ్డీ పథకాన్ని కుదించారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ బిగించే విధానం రైతులు మెడకు ఉరితాడు వంటిదని ఇది క్రమక్రమంగా రైతులకు ఉచిత విద్యుత్తు దూరం చేయడమేనని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు ఆశపడి రైతులు మెడకు గుదిబండలాంటి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక జీవోలను వెంటనే రద్దు చేయాలని డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ పమిడి రమేష్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు వ్యవసాయ కూలీలు ఆత్మహత్యల రేటు పెరిగిందని రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో చేయడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. జగన్ పరిపాలనలో సూక్ష్మసేద్యం అటకెక్కింది 2020లో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్వహించాల్సిన ఈ పథకం దేశంలో మిగతా రాష్ట్రాల్లో సజావుగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయింది అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, కౌలు రైతులను విస్మరించారని, రైతులకు అందించాల్సిన ఎరువులు పురుగు మందులు సకాలంలో అందించడం లేదని, గొప్పలు చెప్పుకోవడం కాదు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.అనంతరం డాక్టర్ నూకసాని బాలాజీ, పమిడి రమేష్ బాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు టిడిపి నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరావు, ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, పసుపులేటి సునీత, మాజీ ఎంపీపీ నరసమ్మ, దాయనేని ధర్మ, టౌన్ ఎస్సీ సెల్ నావురి కుమార్, మాజీ కౌన్సిలర్ పాతూరి పుల్లయ్య చౌదరి, గుర్రాల రాజ్ విమల్ లు రైతులతో కలసి భోగి మంటలలో జి ఓ ల ను వేసి కాల్చివేసి నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *