నివేశ స్థలాల మంజూరులో అవకతవకలు నివారించాలి.. జనసేన పార్టీ

నివేశ స్థలాల మంజూరులో అవకతవకలు నివారించాలి.. జనసేన పార్టీ

కొండపి జనవరి 13 న్యూస్ మేట్ : మనిషి జీవించడానికి ఉండాల్సిన సదుపాయాల్లో ముఖ్యమైనది ఇల్లు ఇళ్ల స్థలం లేని పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాల మంజూరు కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి కనపర్తి మనోజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మరలా సర్వే చేసి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడాలి, నిజమైన పేదవారు ఎవరో గుర్తించి, అర్హులైన వారందరికీ ప్రభుత్వం నుండి రావలసిన పథకాలు మొత్తం వారికి మాత్రమే అందేలాగా అధికారులు చూడాలి,పేదవాళ్లు పేదవాళ్ళ లాగా మిగిలిపోతున్నారు అంటే ప్రభుత్వం నుండి వారికి రావలసిన సదుపాయాలు మొత్తం సక్రమంగా సకాలంలో అందినట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుంది, అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు అండగ జనసేన పార్టీ ఉంటుంది, ప్రజల పక్షాన న్యాయమైన పోరాటం చేయడానికి ఎప్పుడు జనసేన పార్టీ సిద్ధంగానే వుంటుంది, ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో ప్రజలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము అని ఆయన అన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *