రైతు వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటలు తగులబెట్టిన రైతు సంఘం నాయకులు

రైతు వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటలు తగులబెట్టిన రైతు సంఘం నాయకులు

పొన్నలూరు జనవరి 13 న్యూస్ మేట్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను నిరసిస్తూ పొన్నలూరు మండలం చౌట పాలెం లో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటల్లో తగులబెట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కెవి రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది రైతులు చలిలో వణుకుతూ ఢిల్లీ నగరంలో 40 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు .ఒకవైపు కోర్టు ఆక్షేపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండిగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు .కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తులను కమిటీలో నియమించుకొని రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమాలు ఆగవని ఉదృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారావు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *