ప్రభుత్వాల క్రీడలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి

ప్రభుత్వాల క్రీడలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి

15/01/21
ఉలవపాడు జనవరి 15 న్యూస్ మేట్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కోశాధికారి కంచర్ల శ్రీకాంత్ చౌదరి అన్నారు. జై భీమ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ పోటీలు శుక్రవారం ఉలవపాడు లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాంత్ హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు ఆట పాటలు విద్యార్థి లోని సృజనాత్మకతను వెలికి తీస్తాయి అని అన్నారు. రాను రాను సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంక్రాంతి సందర్భంగా కబాడీ వంటి పోటీలు ప్రథమంగా నిర్వహించేవారని ఆయన గుర్తు చేశారు.ఈనాడు సాంప్రదాయ క్రీడలను చూద్దామన్నా ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా జై భీమ్ అసోసియేషన్ యువకులు శ్రీకాంత్ ని ఘనంగా సన్మానించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *