రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈనెల 19న రౌండ్ టేబుల్ సమావేశం.. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ

రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈనెల 19న రౌండ్ టేబుల్ సమావేశం.. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ

ఒంగోలు టౌన్ జనవరి 15 న్యూస్ మేట్ :  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల లను నిరసిస్తూ ఈనెల 19న ఉదయం 10 గంటలకు సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. అఖిలభారత కిసాన్ పోరాట సమన్వయ కమిటీ నేతృత్వంలో గత 50 రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన కొనసాగిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది అని ఆయన అన్నారు . సుప్రీంకోర్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి నల్ల చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ, పరిష్కారానికి కమిటీని’ నియమించింది.కమిటీలోని సభ్యుల్లో ఒకరైన భూపేందర్ సింగ్ మాన్ కమిటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు, నల్ల చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని అందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు అని ఆయన పేర్కొన్నారు.కావున జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు, ఏ ఐ కె ఎస్ సి సి నాయకులు,రైతు ప్రతినిధులు,అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *