రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కనిపించని కోవిడ్ నిబంధనలు
ఉదయగిరి జనవరి 15 (న్యూస్ మేట్ ) : నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ దుకాణం దగ్గర కోవిడ్ నిబంధనలు పాటించిన దాఖలాలు ఎవరికీ కనిపించలేదు. ఒక్కసారిగా మద్యం ప్రియులు దుకాణాలపై కి కొనుగోలుకు బారులు తీరడంతో మద్యం దుకాణం సిబ్బంది కి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సరిపడా మద్యం నిల్వలు లేకపోవడంతో అనేకమంది మద్యం ప్రియులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక మద్యం షాప్ దగ్గర వాచ్ మెన్, సేల్స్ మెన్, సూపర్వైజర్, క్యాషియర్ ఇంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అటు దుకాణాల నిర్వాహకులు గానీ ఇటు మద్యం కొనుగోలుదారులు కానీ పాటించకపోవడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా మద్యం నిల్వలు లేకపోవడంతో కొన్నిచోట్ల నాటు సారాయి రాజ్యమేలుతుందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.