శ్రీ చక్ర బజాజ్ షోరూం లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శ్రీ చక్ర బజాజ్ షోరూం లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే 15/01/21
కందుకూరు జనవరి 15 న్యూస్ మేట్ :  పట్టణం లోని శ్రీ చక్ర బజాజ్ షోరూం నిర్వాహకులు మర్రిపూడి శీను మర్రిపూడి ప్రసాదులు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా 50 లక్షల రూపాయల విలువైన బహుమతులను లక్కీడ్రా ద్వారా విజేతలకు శనివారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి లక్కీ డ్రా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం నింపే విధంగా లక్కీడ్రా ద్వారా బహుమతులు అందజేసి వారి కుటుంబాల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. ఈ విధంగా ప్రజలను నిరంతరం సంతోష పెట్టే విధంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్య నాయుడు టిడిపి పట్టణ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాజీ ఏఎంసీ చైర్మన్ లు తలపనేని వెంకటేశ్వర్లు తోకల కొండయ్య వైసిపి పట్టణ కన్వీనర్ రఫీ నాయకులు వసంతరావు ఉన్నం భాస్కరరావు రమణారెడ్డి చక్క వెంకట కేశవరావు కృష్ణారెడ్డి సుల్తాన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *