బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని కల్యాణ్పూర్ పరిధిలోని ఛక్కన్ టోలీ గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక పలు ఇళ్లకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. గ్రామ పెద్ద ఫిరోజ్ ఖాతూన్ మీడియాకు అగ్ని ప్రమాద వివరాలు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా పలువురు నిర్వాసితులయ్యారని, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో బీహార్లో పలు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఏప్రిల్ 2న బంకాలో జరగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. అంతకుముందు అర్రియా జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు.