సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘన

రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చి మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలుచేసిన వ్యాజ్యాలపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వీరారెడ్డి, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(కె) మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో ఎన్నికల కమిషనర్‌కి విస్తృత అధికారాలు కల్పించినా…చట్టబద్ద నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. ఏ కారణం చేతనైనా ఎన్నికలు వాయిదా పడి, రీ నోటిఫికేషన్‌ జారీ చేస్తే…తిరిగి నామినేషన్లు వేసే దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. ఎన్నికలు రీ నోటిఫై చేయడానికి గల కారణాలను ఉత్తర్వుల్లో వెల్లడించాలి. అప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన వారి డిపాజిట్లను ఎస్‌ఈసీ తిరిగి చెల్లించాలి. గత ఏడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించే క్రమంలో కరోనా కారణంగా 2020 మార్చి 15న ఎస్‌ఈసీ ఎన్నికలను 6 వారాలు వాయిదా వేసింది.

దీంతో ఎన్నికలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రెండు మూడు నెలల్లో కరోనా అదుపులోకి వస్తుందనే భావనతో ఆరు వారాల తరువాత లేదా కరోనా తగ్గాక నిలిచిపోయిన దగ్గర నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని గత ఏడాది మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఎన్నికలను వాయిదా వేయలన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సైతం ఎన్నికల వాయిదా పై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్ధించింది. అయితే ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే నిలిచిపోయిందో… అక్కడ నుంచే తిరిగి ప్రారంభిస్తామన్న ఎస్‌ఈసీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఎస్‌ఈసీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే పేర్కొంది. పోలింగ్‌ తేదీకి నాలుగువారాల మందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులను విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభిస్తూ ఈ నెల ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే రోజు ఎన్నికల ప్రవర్తానా నియమావళి అమల్లోకి వస్తుందని, ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త కమిషనర్‌ బాధ్యతలు తీసుకున్న రోజే హడావుడిగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎస్‌ఈసీ అతిక్రమించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదు.

కోడ్‌ ఉండగానే…

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా శనివారం రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టే కార్యక్రమం నిర్వహించారు. కోడ్‌ అమల్లో ఉండగా విధానపరమైన నిర్ణయాలు, తీర్మానాలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. అలాంటి సమావేశా లు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఎన్నికలు వాయిదా వేసి ఏడాది గడిచింది. ఈ కాలంలో వయస్సు రీత్యా చా లా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించా రు. వారిని పోటీ చేసేందుకు అవకాశం కల్పించకపోవ డం రాజ్యాంగం కల్పించిన హక్కును హరించడమే. ఈ దృష్ట్యా మొదటి నుంచి ఎన్నికల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని రూల్‌-7 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ తాజా నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఎస్‌ఈసీని ఆదేశించండి’’ అని కోరారు. ఆ వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు… ఈ వ్యాజ్యాలపై ఎస్‌ఈసీ, ప్రభుత్వం తరఫు వాదనల కోసం విచారణను ఆదివారానికి వాయిదా వేశా రు. కాగా, కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ…నిలిచిపోయిన దగ్గర నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని గత ఏడాది 2020 మార్చి 15న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌తో పాటు తదనంతరం 2020 మే 6 న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న లింగాల భువనేశ్వరాచారి, బండి పూజిత, వడ్డి భార్గవ్‌ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ, ఈ నెల 1న ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు.

కోర్టుల జోక్యానికి తావులేదు: ఎస్‌ఈసీ

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎస్‌ఈసీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని ఎస్‌ఈసీ కార్యదర్శి కె. కన్నబాబు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఈ వ్యాజ్యంలో ఎస్‌ఈసీ కార్యదర్శి శనివారం కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘పోటీ చేసే అర్హత సాధించారనే కారణంతో మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని కోరడం సరికాదు. కరోనా వల్ల నిలిచిపోయిన ఎన్నికలను ఎక్కడ నిలిచిపోయాయో..అక్కడ నుంచే ప్రారంభిస్తామని గత ఏడాది మార్చి 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఏడాది కాలంగా ఎన్నికలు వాయిదా పడడం తో పలువురు పోటీ చేసే అర్హత సాధించారని పిటిషనర్లు చెబుతున్నారు. మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకపోతే వారు హక్కును కోల్పోతారని చెబుతున్నా రు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రాథమిక హక్కుకాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా కేసులు తగ్గాక ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్‌ ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది’’ అని ఆ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

నోటిఫికేషన్‌ రద్దు చేయండి..జనసేన అత్యవసర వ్యాజ్యం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు శనివారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. నిలిచిపోయిన దగ్గర నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఇచ్చి న ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. నామినేషన్లు వేసేందుకు అనుమతిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వేణుగోపాలరావు వ్యాజ్యం గురించి న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ముందు ప్రస్తావించారు. బీజేపీ, టీడీపీ వేసిన వ్యాజ్యాలతో కలిపి విచారించాలని అభ్యర్థించారు. పిటిషన్‌ బెంచ్‌ ముందుకు రాలేదనే కారణంతో న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు.

ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని సూచించారు. వ్యాజ్యంలో ఏముందంటే… ‘‘గత ఏడాది మార్చిలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ చర్యలతో ప్రజాస్వా మ్యం అపహాస్యం అయిందని 2020 మార్చి 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చా రు. నామినేషన్ల దాఖలు అడ్డగింత, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని అందులో పేర్కొన్నా రు. కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్‌ హడావుడిగా ఈ నెల 1న నోటిఫికేషన్‌ జారీ చేశా రు. ఎన్నికలు తిరిగి ప్రారంభించే అంశం పై చర్చించేందుకు ఈ నెల 2న సమావేశానికి రావాలని రాజకీయ పార్టీలకు వర్తమానం పంపారు. మొదటి నుంచి ఎన్నికలను ప్రారంభించాలని, ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాం. అది పెండింగ్‌లో ఉండగా, తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయడం సరికాదు’’ అని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *