జిల్లాలోని దరూర్ క్యాంప్‌లో బుర్ర మహేందర్ గౌడ్ (38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ సబ్ స్టేషన్లో అసిస్టెంట్ అపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ కావడం లేదని మనస్తాపం చెందిన మహేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.