ఇండోనేషియా దేశంలోని తూర్పు తైమూర్ ద్వీపాల్లో సంభవించిన భీకర తుపానులో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఇండోనేషియా నావికాదళం బుధవారం ఆసుపత్రి నౌకలను సిద్ధం చేసింది. ఇండోనేషియా దీవుల్లో తుపాన్, వరద బీభత్సం వల్ల కొండచరియలు విరిగిపడి 150 మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారు.తుపాన్ వల్ల దెబ్బతిని నిరాశ్రయులుగా మారిన 10వేలమందిని శిబిరాలకు తరలించారు.తుపాన్ బాధితులకు హెలికాప్టర్ల సాయంతో ఆహారం అందిస్తున్నారు. ఆసుపత్రి ఓడలు జకార్తా, ఇండోనేషియా రాజధానికి తూర్పున ఉన్న సెమరాంగ్ నుంచి విపత్తు సంభవించిన ప్రాంతానికి బయలు దేరాయని విపత్తు సహాయ ప్రతినిధి రాదిత్య తెలిపారు.ఆసుపత్రి నౌకల్లో తుపాను వల్ల గాయపడిన వారికి చికిత్స అందించాలని నిర్ణయించారు. తుపాన్ వల్ల వంతెనలు,వేలాది గృహాలు దెబ్బతిన్నాయి.