అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం బోరేగావ్ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్ కాలనీలో నివాసముంటున్నారు. కుమారుడు అరుణ్‌కుమార్(24) ఓ ప్రైవేటు మాల్ పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లిన అతడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం కుటుంబసభ్యులు నిద్రలేపే యత్నం చేయగా లేవలేదు. వెంటనే 108 సిబ్బందిగా సమాచారం అందించారు. వారు అక్కడకు వచ్చి అరుణ్‌ను పరీక్షించి మృతి చెందాడని నిర్థారించారు. సైదాబాద్ పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.