మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కరోనాతో కన్నుమూత!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూశారు. కరోనా బారిన పడిన శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు. శ్యామాచరణ్ గుప్తా భార్య జమనోత్రి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్యామాచరణ్ గుప్తా బీజేపీ, సమాజ్‌వాదీపార్టీల తరపున ఎంపీగా ఉన్నారు. దీనికి ముందు ఆయన ప్రయాగ్‌రాజ్‌కు మేయర్‌గా కూడా వ్యవహరించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *