‘రాళ్లపాడు’కు వెలుగొండ నీళ్లు

(P.Bala Kotaiah)

‘రాళ్లపాడు’కు వెలుగొండ నీళ్లు
కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
రాళ్లపాడుకు వెలుగొండ ప్రాజెక్టు నీటిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, వెలుగొండ నీటిపై హక్కు కల్పించే జీవోను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జారీ చేయనున్నారని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో మండల వ్యవసాయ సలహా మండలి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు విత్తనాలు, యంత్ర పరికరాలు ఇస్తోందని, వాటిని అవసరం లేని వారు కూడా తీసుకెళ్లి దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సబ్సిడీతో పొందినవి నిజంగా ఉన్నాయా?, లేవా? అనే విషయాన్ని అధికారులు ఎప్పుడూ పరిశీలించకపోవడం వల్లే దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు పండ్ల తోటలకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తుంటే మామిడి తోటలను రైతులు ఎందుకు నరికేస్తున్నారని ప్రశ్నించారు. తాను కూడా 25 ఎకరాల తోటను నరికివేసిన విషయాన్ని గుర్తుచేశారు. మాచవరం, కరేడు గ్రామాలలో తమలపాకు తోటలు గతంలో ఉండేవని, అవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయని చెప్పారు. ఇందుకు గల కారణాలు అన్వేషించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రకృతి సేద్యం కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతున్న విషయం ఇంతవరకు తనకు తెలియదన్నారు. సోమశిల నీటిని సరఫరా చేసే కాలువకు రూ.480 కోట్లతో లైనింగ్‌ నిర్మాణం జరగనుందని చెప్పారు. సమావేశంలో కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గణేశం శిరీష, కందుకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.శేషగిరిరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు లకీëనరసింహం, కందుకూరు మండల వ్యవసాయ అధికారి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *