గనుల్లో భారీ ప్రమాదాలు- బలవుతున్న నిరుపేదలు

(Mohammed Jaffer, Foriegn Affairs, Newsmate)

(Newsmate, Friday, July 3, 2020)

కాచిన్‌ : మయన్మార్‌లోని కాచిన్‌ రాష్ట్రంలో గురువారం ఘోర దుర్ఘటన గతంలో గాయాలను గుర్తు చేస్తోంది. విలువైన జాడే(ఆకుపచ్చ రాయి) గనులు ఉండే హపాకాంత్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మందికిపైగా కార్మికులు తాజాగా మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా గనుల తవ్వకాలపై చర్చ సాగుతోంది. ఈ తవ్వకాల్లో పేదలే బలవుతున్నారు. ప్రత్యక్ష సాక్షి, కార్మికుడు మౌంగ్‌ కియాంగ్‌ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడుతోన్న సందర్భాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని, ఆ సమయంలో కొండ కింద గనిలో ఉన్న కార్మికులందరూ ‘పరిగెత్తండి.. పరిగెత్తండి’ అంటూ అరిచారని చెప్పారు. ఒక్క నిమిషంలోనే కార్మికులందరూ బురద కింద కూరుకుపోయి కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ దృశ్యాన్ని చూసి నా గుండె భరించలేకపోయింది. నా కళ్ల ముందు ఇంకా ఘోర దుర్ఘటన ఇంకా మెదలాడుతూనే ఉంది. ఆ బురదలో చిక్కుకుపోయిన వారు కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో వారికి కాపాడేందుకు అక్కడ ఎవరూ లేరు’ అని పేర్కొన్నారు. విపత్తు అనంతరం సహాయక చర్యలు అందిస్తున్న స్థానిక సివిల్‌ సొసైటీ గ్రూపునకు చెందిన సభ్యుడు థాన్‌ హ్లాయింగ్‌ మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో చనిపోయిన వారందకూ అనధికారిక కార్మికులని, ఒక భారీ మైనింగ్‌ కంపెనీ నుంచి విడుదలైన వ్యర్ధాలను శుద్ధి చేస్తున్నారని చెప్పారు. బాధిత కుటుంబాలకు పరిహారం వస్తుందన్న ఆశ కూడా లేదని ఆమె అన్నారు. కాచిన్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. 2015లో కొండచరియలు విరిగిపడడంతో 116 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. హపా కాంత్‌లోని ఈ మైన్స్‌లో అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆకుపచ్చ రత్నాల వేట కోసం జరుగుతున్న కార్యకలాపాల సమయంలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులందరూ నిరుపేదలే కావడం గమనార్హం. 2016లో అధికారంలోకి వచ్చిన సమయంలో మైనింగ్‌ రంగంలో సమూలంగా మార్పులు తెస్తామన్న ఆంగ్‌సాన్‌సూకీ మాటలు నీటిమూటలుగా మారాయని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *