నవంబర్ 8న మయన్మార్ ఎన్నికలు..!

(Mohammed Jaffer, Foreign Affairs)

(Newsmate, Friday, July 3, 2020)బ్యాంకాక్‌ :  ఏడాది, నవంబర్‌ 8 మయన్మార్లో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నట్లు దేశానికి చెందిన మీడియా వెల్లడించింది. నేపథ్యంలో గత అర్ధ శతాబ్ధం కాలంలో ఎన్నికలు మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పరీక్ష కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూనియన్ఎన్నికల కమిషన్చైర్మన్హ్లాథీన్ప్రకటన చేసినట్లు పేర్కొంటూ నవంబర్‌ 8 పార్లమెంట్కు బహుళ పార్టీలకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయని స్థానిక టివిఛానెళ్లు నివేదించాయి. ప్రత్యక్ష సైనిక పాలన నుంచి బయటకు వచ్చిన మయన్మార్పరివర్తనకు ఎన్నికలు ఒక పరీక్షగా నిపుణులు చూస్తున్నారు. దశాబ్ధాల జుంటా పాలనకు ముగింపు పలుకుతూ 2015 ఎన్నికల్లో నోబెల్శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్సూకీ నేతృత్వంలోని నేషనల్లీగ్ఫర్డెమోక్రసీ పార్టీ భారీ ఘనవిజయం సాధించింది. కానీ 2017లో భారీగా సైనిక అణచివేతతో వందలాది మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్కు తరలిపోవడంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఉన్న అపార మైన అధికారాన్ని ఇప్పటికీ సైన్యం అక్కడ ప్రయోగిస్తూనే ఉంది. రాజ్యాంగం ప్రకారం సైన్యానికి కీలక మంత్రిత్వ శాఖలపై నియంత్రణ, పార్లమెంట్లో 25 స్థానాల హామీ ఉంది. అయినా కూడా ఇతర పార్టీల కన్నా అక్కడ సూకీకి చెందిన పార్టీకే విజయానికి మొగ్గు ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *