అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని – మున్సిపల్ కమిషనర్

 

24KANIGIRI

అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని – మున్సిపల్ కమిషనర్

కనిగిరి సెప్టెంబర్24( న్యూస్ మేట్ ) : స్థానిక నగర పంచాయితీ కార్యాలయంలో గురువారం బ్యాంకర్లతో మున్సిపల్ కమిషనర్ డి.వి. ఎస్ నారాయణ రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, పి ఎం స్వానిది పదకాలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేసి లబ్ధిదారుల జీవనోపాధి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు. న్యాయవాది షేక్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, వై ఎస్ ఆర్ భీమా పధకంలో జన్ దన్ అకౌంట్లు లేని వారికి నూతన అకౌంట్లు చేయించాలన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ సరైన ద్రువపత్రాలు తో రుణాలు ఇస్తే తిరిగి చెల్లిస్తారు అని భరోసా అధికార కార్యాలయం నుండి లభించిందని అన్నారు. చిరు వ్యాపారస్తుల ఆర్థికాభిృద్ధికి తప్పకుండా సహకరించ గలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది కల్పన , సురత్న, బ్యాంక్ మేనేజర్లు మాలకొండయ్య, చారి , హిమాంజలి, సచివాలయ వెల్ఫ్ ర్ ,తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *