స్వచ్ఛత స్ఫూర్తి… నీవు ఎక్కడ…?
వలేటివారిపాలెం సెప్టెంబర్ 24 న్యూస్ మేట్. మండల కేంద్రమైన వలేటివారి పాలెం గ్రామంలో పలు అంతర్గత రహదారుల లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని కాలువలలో చెత్తాచెదారం నిండి అపరిశుభ్రత నెలకొంది.న్నారు. మాంసం, చికెన్, హోటల్, టెంకాయ తదితర దుకాణాల వ్యర్థాలను పామూరు రోడ్డు, అంకభూపాలపురం రోడ్డు రహదారుల వెంబడి కుప్పలు తెప్పలుగా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యర్ధాలలో నీరు చేరి నిల్వ ఉంటే డెంగ్యూ వ్యాధిని కలుగచేసే దోమలు వృద్ధి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మెరుగైన సేవలుఅందించాలని సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక స్వపరిపాలన అందుబాటులోకి వచ్చినా నిస్ప్రయోజనంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది సచివాలయ ఉద్యోగులు సచివాలయాల కే పరిమితం కావడంతో పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుచున్నారు.