14 కోట్ల రూపాయల నిధులతో డ్రైనేజీలు సిసి రోడ్డు ఆధునీకరణ : కమిషనర్ డివిఎస్ నారాయణరావు.

14 కోట్ల రూపాయల నిధులతో డ్రైనేజీలు సిసి రోడ్డు ఆధునీకరణ : కమిషనర్ డివిఎస్ నారాయణరావు.
కనిగిరి సెప్టెంబర్ 24 (న్యూస్ మెట్): కనిగిరి నగర పంచాయతీ పరిధిలో సుమారు 14కోట్ల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు.

నగర అభివృద్ధికి 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కనిగిరి మున్సిపల్ కమిషనర్ డి.వి.వి.ఎస్.నారాయణ రావు తెలిపారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో సుమారు 14కోట్ల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా వర్షం పడినప్పుడు పాత డ్రైనేజీ వ్యవస్థ అవ్వడం వల్ల మురుగునీరు రోడ్లపైకి రావడం జరుగుతుందని అలాంటిది ఇకమీదట జరగకుండా ఆ పాత డ్రైనేజీ కాలువలు సైతం ఆధునీకరించడానికి నాలుగు కోట్ల తో టెండర్లు పిలవ నున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నగర పంచాయతీలోని కొన్ని భవనాలు డ్రైనేజీలు మీద ఆక్రమించుకొని కొందరు వాటిని పగలగొట్టడం వల్ల డ్రైనేజీలు ధ్వంసం అయ్యాయని ఆయన అన్నారు . నగర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆయన తెలిపారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *