పొట్లూరు గ్రామ సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపిడిఓ ఎం వెంకటేశ్వర్లు

పొట్లూరు గ్రామ సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపిడిఓ ఎం వెంకటేశ్వర్లు

గుడ్లూరు సెప్టెంబర్ 24 (న్యూస్ మెట్) : మండలం లోనీ పోట్లూరు గ్రామ సచివాలయాన్ని గురువారం ఎంపిడిఓ ఎం.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ ఉద్యోగుల కు సంబందించిన రిజిస్టర్ లు పరిశీలించారు.

24 GUDLURU

మెరుగైన పని తీరు కోసం తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఉద్యోగులు , వాలంటీర్స్ తో ప్రస్తుతం జరుగుతున్న EOL సర్వే, వైఎస్సార్ భీమా సర్వే ల పై రివ్యూ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పదకాలలో ఏ ఒక్క లబ్ది దారుడు నష్ట పోకూడదు అని ఎవరైనా పధకాలను అడ్డుపెట్టుకొని లబ్ధిదారులను ఇబ్బంది పెడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో COVID-19 ని ఎలా నియంత్రించాలి, ప్రైమరీ ,సెకండరీ కాంటాక్ట్స్ ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చెయ్యాలి అని మహిళా పోలీస్ ను ఆదేశించారు. అనంతరం. సచివాలయం లో కేవలం 30 నిమిషాలలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ సర్వీసెస్ పొందిన పూసపాటి శివ నాగేంద్రమ్మ కి,60 నిమిషాలలో న్యూ రైస్ కార్డ్ పొందిన లబ్ది దారుడు బుదూరి భారతి కి అక్కడికక్కడే సర్టిఫికెట్ , రైస్ కార్డ్ ప్రింట్ తీసి లబ్ది దారులకి ఎంపీడీవో ఎం వెంకటేశ్వర్లు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి డాక్టర్ మారుతీ రావు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *