కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారం అందించాలి – ఎంపిడిఓ కె.మాలకొండయ్య
లింగసముద్రం సెప్టెంబర్24( న్యూస్ మేట్ ): స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీల కార్యదర్శు:ల సమావేశం జరుగుతుందని ఎంపిడిఓ కె.మాలకొండయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశం ఉదయం 10 గంటలకు జరుగుతుందని ప్రతి ఒక్కరు సమయ పాలన పాటించాలని ఆయన అన్నారు. ఈ సమావేశానికి పంచాయితీ కార్యదర్శులు, వెల్ఫేర్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు , ఏ ఎన్ ఎం లు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన అన్నారు. సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు మండలంలో ఉన్న కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారం తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామాల్లో మొత్తం కరోనా కేసులు వివరాలు, కరోనా యాక్టీవ్ కేసులు, కోలుకున్న కేసుల వివరాలు వెల్లడించాలని ఆయన అన్నారు.