కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని

పామూరు సెప్టెంబర్ 25 (న్యూస్ మేట్):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ రోడ్డులోని రైతుల ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కు సిపిఎం పచ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ నిరసన మద్దతు తెలియజేశారు.ఈ
సందర్భంగా సయ్యద్. హనీఫ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సంక్షోభం నానాటికీ తీవ్రరూపం అవుతుందని , గిట్టుబాటు ధరలు లేక రుణభారం పెరగడం ప్రకృతి వైపరీత్యాలు తదితర కారణాల వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు ఉరితాడుగా మారుతుందని కేవలం పెట్టుబడులు లాభాలు విదేశీ, స్వదేశీ కంపెనీలు భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలిపారు. వినియోగ బిల్లును ఆమోదించి పార్లమెంటు చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని, ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ బిల్లు ను ఆమోదు చేయడం, రాష్ట్రంలో వైసిపి టిడిపి ఆ బిల్లుకు ఆమోదం తెలపడం రైతులలో ఆత్మహత్యలు పెంచడమే అని ఆయన అన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వల్ల పోరాడి సాధించుకున్న ఉచిత విద్యుత్ పథకం కొనసాగించాలని , రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీ పథకం అమలు జరపడం కోసం జీవో నెంబర్ 22 వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొ మ్మాలపాటి మాల్యాద్రి, వైవి. నారాయణ, షేక్. కాసిం సాహెబ్, వెంకటేశ్వర్లు, షేక్. చాంద్ భాష, షేక్. అల్లాబక్షు, మహదేవయ్య, కే. శంకర్ , కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *