జగనన్న చేదోడు చిరు వ్యాపారులకువరం – కమిషనర్ D V S నారాయణ రావు

జగనన్న చేదోడు చిరు వ్యాపారులకువరం: కమిషనర్ D V S నారాయణ రావు

కనిగిరి సెప్టెంబర్ 25 (న్యూస్ మెట్)రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న చేదోడు అనే పథకం పేదలకు వరం అని మున్సిపల్ కమిషనర్ డి.వి.వి.ఎస్.నారాయణ రావు అన్నారు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు . ఈ పథకం చిరు వ్యాపారస్తులకు కోసం ప్రవేశపెట్టారు అని ఆయన తెలిపారు. ఈ పథకం తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకునే వారు టీ కిల్లి దుకాణాలు . కిరాణా దుకాణాలు మరియు ఇళ్ల వద్ద చేతివృత్తులు చేసుకునే కుమ్మరి ఇస్త్రీ చేసే వారు టైలర్స్ పాల వ్యాపారస్తులు అర్హులని వీరు తమ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ తో వారి సచివాలయంలో సంప్రదించి నమోదు చేసుకున్న వారం రోజులలోనే వారికి రుణం మంజూరు చేయిస్తామని చెప్పారు. అట్టి రుణం పొందిన వారు సున్నా వడ్డీ తో సంవత్సర కాలంలో రుణాన్ని చెల్లించిన యెడల మరొకసారి వారికి 20 వేల రూపాయల రుణం మంజూరు చేస్తారని ఆయన అన్నారు . ఈ పథకంలో లబ్ధి దారులు నమోదుకు పరిమితి లేదని అర్హులైన చిరు వ్యాపారస్తుడు ఎవరైనా నమోదు చేసుకోవచ్చని ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *