యదేచ్ఛగా ప్రభుత్వ ఆస్తుల కబ్జా …
*చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
*ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన సిపిఐ నాయకులు
కనిగిరి సెప్టెంబర్ 25 ( న్యూస్ మేట్ ) : ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో భూ కబ్జాదారులు వాగులు వంకల్లో సైతం ప్లాట్లు వేస్తున్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో నాగుల చెరువు పట్టణానికి ప్రాణప్రదంగా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది రాజకీయ అండ దండలతో నాగుల వాగుని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమేర ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాగుల్ వాగు సమీపంలోనే భూములను ప్లాట్లుగా తయారుచేసి వాగు పారుదలకు ఆటంకం కలిగించారు గతంలో పరిసర ప్రాంతాల్లో భూములు వ్యవసాయం చేసేవారు కానీ ఇటీవల కాలంలో వాగులు పూడ్చి వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దాంతో వాగు పారుదల నిలిచిపోవడంతో నీళ్లన్నీ రోడ్డుపై ప్రవహిస్తున్నాయి ఫలితంగా రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో జారి కింద పడుతున్నారు ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు . వాగు పైభాగంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కోసం కట్టడాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికారులు ప్రలోభాలకు లోనవుతూ అధికార పార్టీకి దాసోహం గా మారటం తో కుంటలు వాగులు వంకలు మాయం అవుతున్నాయి. పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తాం చేస్తాం అనటం మినహా ప్రభుత్వ ఆస్తులను కాపాడుదాం అన్న చిత్తశుద్ధి అధికారంలో కనిపించడం లేదు.
సిపిఐ అభిప్రాయం:-
నాగుల వాగు ఆక్రమణలపై సిపిఐ నాయకులు సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుతూ ఎన్నోసార్లు మండల తాసిల్దార్ కి మున్సిపల్ కమిషనర్ కి విన్నపాలు సమర్పించిన పట్టించుకున్న దాఖలాలు లేవు అని తెలిపారు నాగుల వాగుపై అక్రమ కట్టడాలు అధికారులు జోక్యం చేసుకుని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు అధికారులు తగు చర్యలు తీసుకొని ఎడల కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు