వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన

వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన

 

 

కందుకూరు సెప్టెంబర్ 25 న్యూస్ మేట్
చిన్న సన్నకారు రైతులు నడ్డివిరిచే వ్యవసాయ సంస్కరణలు బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని సి పి ఐ ఎం సీనియర్ నాయకులు డాక్టర్ మువ్వ కొండయ్య డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం కందుకూర్ లో నిరసన కార్యక్రమం కొనసాగించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ రైతాంగాన్ని శ్రామిక వర్గాన్ని అధోగతి పాలు చేస్తోందని ఆరోపించారు. భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలు అయితే ఆ ప్రభావం మిగిలిన రంగాలపై చూపుతుందని ఆయన అన్నారు. అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు స్వాగతించడం వారికి రైతుల రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుంది అని అన్నారు . ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లు రైతులను నడ్డివిరిచేదిగా ఉందని కొండయ్య విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓ రామ కోటయ్య దాసరి రామ్మూర్తి ఎస్ ఏగౌస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *