గ్రామాల అభివృద్ధి ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు – జనసేన, బీజేపీ ఆరోపణ

 

 

 

.గ్రామాల అభివృద్ధి ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు – జనసేన, బీజేపీ ఆరోపణ
కందుకూరు (పొన్నలూరు) సెప్టెంబర్ 25 న్యూస్ మేట్:రి గ్రామాల అభివృద్ధి ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలోని చెన్నిపాడు పంచాయతీలో ఎదురువారిపాలెం గ్రామంలో జనసేన ,బిజెపి పార్టీ నాయకులు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఎదురు వారి పాలెం ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నది గ్రామంలో 80 నుండి 100 కుటుంబాలు 500 నుండి 700 మంది ప్రజలు నివసిస్తున్నారు, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులకు ప్రజలు గుర్తుకు తున్నారు తర్వాత వారిని పట్టించుకునే వారు లేరు అని వారు అన్నారు ఆ గ్రామంలో మంచినీటి సదుపాయం లేదు , మంచినీటి సదుపాయం కోసం వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేస్తామని నాయకులు చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలి ఉన్నాయి అని వారు ఆందోళన వ్యక్తం చేశారు డ్రైనేజ్ కాలువలు నిర్మిస్తామని చెప్పారు అంగన్వాడి స్కూల్ ని కూడా నిర్మిస్తామని చెప్పారు, 1వ తరగతి నుండి 5 తరగతుల వరకు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ కి చుట్టూ ప్రహరీ గోడలను నిర్మిస్తామని చెప్పారు, గ్రామంలో సిసి రోడ్లు వేస్తామని చెప్పారు, ఇల్లు లేనివారికి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు, చెన్నిపాడు నుండి ఎదురువాపాలంనకు రావడానికి మూడు కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని నిర్మిస్తామని చెప్పి ఈరోజు నాయకులు మొహం చాటేస్తున్నారు అని ఆ గ్రామ ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో అయితే ఈ రహదారిలో రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది, ఎదురు వారి పాలెం గ్రామాన్ని అభివృద్ధి పరచాలంటే జనసేన అభివృద్ధి అంటే జనసేన మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని వారు పేర్కొన్నారు కనీసం వీధి లైట్లు లేవు, వర్షాకాలం వస్తే ఊరు దాటి బయటకు రావాలంటే చాలా కష్టంగా మారుతుంది, ఇలాంటి అంధకారమైన పరిస్థితుల్లో ఈ గ్రామంలో ప్రజలు నివసిస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అని అని వారు పాలకుల తీరును ఎండగట్టారు కాంగ్రెస్ హయాంలో తర్వాత టిడిపి హయాంలో తర్వాత YSRCP నాయకులు కూడా ఈ గ్రామంలో పర్యటించి మీ గ్రామానికి సంబంధించి అన్ని అభివృద్ధి పనులు మేము చేసి పెడతామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని సీట్లు గెలిచిన తర్వాత మొహం చాటేస్తున్నారు అని అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుధీర్, నరేష్, రాజశేఖర్, జనసేన నాయకులు మోహన్ కృష్ణ, తిరుమల్ రెడ్డి, వెంకట్ రెడ్డి , చైతన్య రెడ్డి, గోపి కృష్ణ, భాష , ప్రవీణ్ , మహేంద్ర , గోవర్ధన్, రానా, రవి , నాగార్జున, చందు, అనిల్, సునీల్, మొదలైన వాళ్లు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *