కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలి, బి కే ఎన్ యు కార్యదర్శి వెంకట్రావు
ఒంగోలు సెప్టెంబర్ 25 న్యూస్ మేట్
కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలి,వ్యవసాయ మీటర్లు నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేఖంగా కొత్తపట్నం లొ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన 3 బిల్లులు పర్యవసానాలు భవిష్యత్తులో దారుణంగా ఉండబోతున్నాయి అనే అన్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, ఎం ఎస్ స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించాలి. అని ఆయన డిమాండ్ చేశారు రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలి అని నిబంధన తీసుకురావాలని ఆయన కోరారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు అని ఆయన వెల్లడించారు ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెట్ కమిటీలు, యార్డులపై శ్రద్ధ పెట్టాలి. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు ఇవన్నీ ఏమీ చేయకుండా కార్పొరేట్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతారు. రైతు నష్టపోతే సామాన్యుడికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుంది అని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలొ మండల సిపిఐ కార్యదర్శి పురిణిఏఐవైఎప్ జిల్లా అధ్యక్షులు పురి ణి.రవి,మల్లికార్జున,గునిమిని.సుబ్బారెడ్డి,మల్లవరపు.ప్రసాదు,ఇండ్ల.రామానందం,ఐ.మదన్ మోహన్,పి.శ్రీను,రాగాల.వెంకయ్య,సిమెన్,పిల్లి.శీను,పులుగు.లక్ష్మి,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.