తూర్పు కోడిగుడ్ల పాడు గ్రామస్తులు వైసీపీలో చేరిక.
పామూరు సెప్టెంబర్ 26 న్యూస్ మేట్ :
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి క్యాంపు కార్యాలయంలో తూర్పు కోడిగుడ్ల పాడు గ్రామ పంచాయతీకి చెందిన ముగ్గురు మాజీ MPTC లు కనిగిరి మాజీ AMC చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పార్టీలో చేరిన వారిలో మాజీ. MPTC లు చెనికల మాలకొండయ్య యాదవ్, చెనికల వెంగమ్మ, డబ్బు కొట్టు ఆదిలక్ష్మమ్మ, జంగాలపల్లి యువజన నాయకులు మానం మల్లికార్జున యాదవ్, చెనికల పెద్ద మాలకొండయ్య యాదవ్ కుటుంబ సభ్యులు కొంతమంది గ్రామస్తులు దారపనేని చంద్రశేఖర్ నాయకత్వంలో చేరుతున్నట్లు మాజీ MPTC లు తెలిపారు.