దోపిడీకి ఎదురు నిలిచిన వీరవనిత  ఐలమ్మ

 

 

దోపిడీకి ఎదురు నిలిచిన వీరవనిత  ఐలమ్మ

పామూరు సెప్టెంబర్ 26 న్యూస్ మేట్: దొరలు, పెత్తందార్లు పటేల్లకు ఎదురు నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ అని స్వయంకృషి సేవా సంస్థ అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్ అన్నారు. శనివారం పామూరు పట్టణంలోని స్వయంకృషి సేవా సంస్థ కార్యాలయంలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్మాస్టర్. జె. గోవిందయ్య మాట్లాడుతూ ఐలమ్మ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి జీవితం త్యాగం చేసి వారి పక్షాన పోరాడిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. ఐలమ్మ బడుగు బలహీన వర్గాల ప్రజలకు పది లక్షల ఎకరాలు పంచిన గొప్ప వ్యక్తి అని, ఐలమ్మను తెలంగాణ ఓరుగల్లు బిడ్డ గా పిలుచుకునే వారని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు అల్లూరయ్య , మీరా మోహిద్దీన్, షేక్. అబ్దుల్ ఖాదర్ , ప్రసాద్ , చెన్నకిష్టయ్య ,ప్రిన్స్ నాయబ్ రసూల్ , సోమిశెట్టి సత్యనారాయణ , ఎమ్మార్పిస్ నాయకులు శేషం మోషే మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *