ఈ రోజు మాలకొండ ఆదాయం 6,30,235రూ…
వలేటివారిపాలెం సెప్టెంబర్ 27 న్యూస్ మేట్:మండలం లోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 6268 మంది భక్తులు స్వామి ని దర్శించుకున్నట్లు ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కెబి శ్రీనివాసరావు తెలియజేసారు.మాలకొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ అర్చకులు గౌరీ శంకర్ స్వామిని సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ద్వారా వివిధ రూపాలలో వచ్చిన ఆదాయం తలనీలాలు ద్వారా వచ్చిన ఆదాయం 16,400 రూ, వాహన పూజలు ద్వారా వచ్చిన ఆదాయం 1,675 రూ, ప్రత్యేక దర్శనం ద్వారా వచ్చిన ఆదాయం 82,100 రూ, స్థలపురాణం ద్వారా వచ్చిన ఆదాయం 170 రూ, రూమ్ అద్దెల ద్వారా వచ్చిన ఆదాయం 16,120 రూ, కవర్ల ద్వారా వచ్చిన ఆదాయం 5,350 రూ, లడ్డూ ప్రసాదం ద్వారా వచ్చిన ఆదాయం 1,59,885రూ, అన్నదానమునకు వచ్చిన విరాళం 3,17,985రూ ఇతర విరాళాలు 30,550 రూ మొత్తం ఆదాయం 6,30,235 రూ రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కే బి శ్రీనివాసరావు తెలియజేసారు.